ఇత‌ర జీవుల‌కు తోక ఉంటుంది కానీ, మ‌నిషికే తోక ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

0
41

మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎదో ఒక పని కోసం నిర్దేశించబడతాయి. అలాగే రూపుదిద్దుకోబడ్డాయి. అవి వాటి పనులను నిత్యం నిర్వహిస్తూ ఉంటాయి. అలాగే ప్రపంచం లో ఉన్న ప్రతి జీవరాశిలో కూడా వాటి అవయవాలు నిర్దిష్టమైన పనులను చేస్తూ ఉంటాయి. అయితే ఎన్ని పక్షులైన , ఏ జంతువైనా , ఏ జీవి అయినా చాలా వరకు వాటిల్లో మనం కామన్ గా గమనించే అవయవం ఒకటి ఉంటుంది. అదేనండి ఆయా జీవుల తోకలు. అవును అవే.

చాలా వరకు అన్ని జీవులకు తోక ఉంటుంది. కొన్నింటికి ఉండదు. అయితే తోక ఉండటం అనేది చాలా వాటికి కామన్ అయినా ఒక్కో జీవికి ఉండే తోక ఒక్కో విధంగా ఉపయోగ పడుతుంది. అది ఎలాగంటే ,

చేపలకు ఉండే తోకలతో అవి నీటిలో సులభంగా ఈద గలుగుతాయి. అదే గేదెలు, ఆవులు, ఎద్దులు వంటి నాలుగు కాళ్ళ జంతువులు తమ తోకలతో శరీరాల ఫై వాలే ఈగలు , కీటకాలు, ఇతర పక్షులను తోలుకుంటూ ఉంటాయి. పిల్లులు , ఖంగారులు వంటి జంతువులు తమ తొక్కలను బ్యాలన్స్ కోసం వాడతాయి. అదే కోతులు అయితే చెట్ల ఫై సులభంగా గెంతడానికి వేలాడటానికి వాడతాయి.

ఇక కుక్క , దుప్పి వంటి కొన్ని జంతువులు తమ తొక్కలను వాటి ఫై వాలే పురుగులను తోలటానికే కాదు , తమతమ భావాలను తోటి జంతువులకు తెలియజేయటానికి కూడా తోకలను ఊపుతూ ఉంటాయి. విభిన్నమైన కోణాలలో వాటిని ప్రదర్శిస్తాయి. తేలు వంటి జీవులయితే ఇతర జీవులను చంపేందుకు తోకలో విషం కలిగి ఉంటాయి. పాముకి ఉండే తోక దాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు ఉపయోగ పడుతుంది.

పక్షులకైతే తోకలు చిన్నగా ఈకల రూపంలో ఉన్న అవి వాటి సహాయంతో గాలిలో సులభంగా ఎగర గలవు. అదే బల్లి అనుకోండి , ఇతర జీవుల నుంచి తనను తాను రక్షించుకొనేందుకు తన తోకను తానే తెంపుకుంటుంది. మళ్ళి అది పెరుగుతుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీవాలన్నీ తమ తోకలను ఏదొక విధంగా ఉపయోగించుకుంటున్నాయి.

కానీ మనుషులకు మాత్రం తోక ఉండదు. ఎందుకంటే మనిషి రెండు కాళ్లపై నిలబడగలడు, సులభంగా బ్యాలన్స్ చేసుకోగలడు. ఈగలు , దోమలు వాలినా చేతులు ఉన్నాయి. ముందుకు సరిగ్గా వెళ్లేందుకు కాళ్ళు ఉన్నాయి. అందుకే మనిషికి తోక అవసరం లేదు. ఒకవేళ ఉంటె ఏమి జరుగుతుందో మనకు తెలుసు కదా. ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయితే మీకు తెలుసా? మనిషి పుట్టాక అతనికి తోక ఉండదు. కానీ గర్భంలో ఉన్నప్పుడు కొన్ని వారాలు తోక ఉంటుంది. అనంతరం శరీరం పెరుగుతున్న కొద్దీ తోక శరీరంలో కలిసి పోతుంది. తోక గురించిన టాపిక్ నిజంగా ఆసక్తిగానే ఉంది కదా.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here