మీ జీవితంలో ఇది నిజమో ! ఏది అబద్దమో ! తెలుసుకోండి ఇలా…

0
92

సామాన్యంగా మనకు తెలిసో తెలియకో కొన్ని పనులు చేస్తూ ఉంటాము. వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించవు. ఉదాహరణకు కొందరు ఎప్పుడు చేయని ఒక విషయాన్ని అదే పనిగా చేస్తుండటం ఇలా మనం చేయగలమా అనే విషయం కూడా తెలియకుండానే చేస్తూ ఉండటం, కానీ అలా ఎందుకు చేసాం అనే విషయం మనకు మాత్రం తెలియదు. అయితే మనం ఇప్పుడు అదే విషయాన్ని గురించి తెలుసుకుందాం.

ఒక మనిషి ఎక్కువగా నిద్ర పోతున్నాడు అంటే దానికి కారణం ఆమె లేదా అతను భాదలో ఉన్నారని అర్ధం. సామాన్యంగా అందరు వాతావరణం చల్లగా ఉందని లేదంటే అలసటగా ఉందని నిద్ర పోతుంటారు. అలా కాకుండా మనకు తెలియ కుండానే ఎక్కువగా నిద్ర పోతుంటే దానికి కారణం వారు దుఃఖంలో ఉన్నట్లు అర్ధమట.

కొన్ని కొన్ని సార్లు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు అందరు ఏడుస్తున్నా మనకు మాత్రం ఏడుపు రాకుండా ఎంత ప్రయత్నించినా కాదు. దానికి కారణం మనకు ఫీలింగ్ లేదేమో అని మనం అనుకుంటాం. అదే విధంగా చూసే వారు కూడా అనుకుంటారు. కానీ నిజానికి ఏడవ లేక పోవడానికి కారణం ఆ మనిషి వీక్ గా ఉండటమేనట. మనిషి ఎంత ఎక్కువగా సంతోషంగా ఉంటే అంత తక్కువగా నిద్రకు ఉపక్రమిస్తారు. అంటే మీరు ఈ రోజు ఎక్కువ సంతోషంగా ఉన్నారనుకోండి ఆ రోజు మీరు తక్కువ నిద్ర పోతారని అర్ధమట. రోజువారీ మనిషి భాదలు మనిషిని నిద్రపోయేలా చేస్తాయట.

ఎవరైనా ప్రతి చిన్న మాటకి విషయం ఉన్నా లేక పోయినా ఏడుస్తూ ఉన్నారనుకోండి వారి ఎన్నో విధానాలు వారి మనసు ఎంతో కోమలమైనది అని అర్ధమట. నిజం చెప్పాలంటే ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు అని మనం అంటూ ఉంటాం. కానీ ఆ మాట కంటే వాస్తవానికి ఎవరు బిజీగా ఉండరట. వారు ఇచ్చే ప్రాధాన్యతలు వాటికి కారణమట. అంటే మీరు ఆఫీసులో ఉన్నారు ఎవరికైనా మెయిల్ పంపించాలి. అది ఆ సమయంలో మీ ఫ్రెండ్ దగ్గరి నుంచి ఒక మెయిల్ వచ్చింది. అతనికి కూడా రిప్లై ఇవ్వాలి. అయితే మీరు ఎక్కువ ఎవరికీ ప్రాధాన్యత ఇస్తారు. మనం ఆఫీస్ లో ఉన్నాం కాబట్టి ఆఫీస్ పనికే ప్రాధాన్యత ఇస్తాము. అంతే, ఎవరికైతే ప్రాధాన్యత ఇవ్వలేదో మీరు బిజీగా ఉన్నారని భావిస్తారు.

మీతో ఎప్పుడైనా ఎవరైనా స్త్రీ తనకు సంబంధిన సమస్యలను చెబుతూ ఉంటే ఆమె మీ దగ్గరి నుంచి సమాధానం కానీ సలహా కానీ ఆశించడం లేదని మీకు తెలుసా? తెలియదు కదా? ఎవరైనా స్త్రీ మీకు ఏదైనా ఇబ్బందులు సమస్యలు చెబుతూ ఉంటే వారికి కావలసింది సమాధానం కాదు , వినే వారు మాత్రమే అని తెలుసుకోవాలి. ఎవరైనా అనవసరమైన దానికి అవసరమైన దానికి ప్రతి చిన్న దానికి కోపం తెచ్చుకుంటుంటే వారికి దూరంగా ఉండటం లేదంటే పిల్లలను దూరంగా ఉంచడం లాంటి పనులను చేస్తూ ఉంటాం. కానీ నిజానికి ప్రతి చిన్న దానికి కోపం తెచ్చుకునే వారికి కావలసింది ప్రేమ మాత్రమే.

ఎవరైనా భోజనం చేసే సమయంలో ప్రతి రోజు తినేలా కాకుండా విచిత్రంగా లేదా కొత్తగా వ్యవహరిస్తే వారు టెన్షన్ పడుతున్నారు అని అర్ధం. ఎవరైనా ఎక్కువగా ప్రామిస్ లు చేస్తూ ఉంటే వారు నిజాయితీ పరులని, స్నేహానికి ప్రాణం ఇస్తారని, స్నేహితులకు ఎలాంటి సమస్య వచ్చినా ముందు ఉంటారు అని అర్ధమట. మీరు ఎవరినైనా మిస్ అవుతున్నప్పుడు మీకు కన్నీళ్లు రావట. వారు మిస్ అవ్వకూడదు అని అనుకున్నప్పుడు మాత్రమే కన్నీళ్లు వస్తాయట.

ఒక అధ్యాయనం ప్రకారం మిగతా వారితో పోలిస్తే తెలివైన వారు తమ బంధాలను నిజాయితీగా నెరవేరుస్తారట. నిజాయితీగా ఉంటారట. ప్రేమ అనేది ఉదయం మొదలయ్యి సాయంత్రానికి ముగిసేది కాదు. మీకు అవసరం లేనప్పుడు ప్రేమ పుట్టి, ప్రేమ అవసరం ఉన్నప్పుడు దూరం అవుతారు. ఇదే ప్రేమంటే. స్త్రీ పురుషులు సామాన్యంగా కంటే ఎక్కువ సార్లు కళ్ళను ఆర్పేది తమకు ఆసక్తి ఉన్న వారితో చేర్చిస్తున్న సమయంలో. కోపం అనేది భాదను తప్పిచుకోవడానికి ఒక ఫీలింగ్. ఒకసారి నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని అంటే దానికి అర్ధం నువ్వు నన్ను గాయపరిచావు అని అర్ధమట

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here