భరత్ అనే నేను తోపుగాడి రివ్యూ 100% జెన్యూన్ & యూనిక్

0
687

తోపుగాడు అనే నేను ఈ ఆర్టికల్ ని ఎటువంటి రాగద్వేషాలు లేకుండా విధేయతతో , నిభద్రతతో, అంతకరణ శుద్ధితో రాస్తున్నాను అని ప్రమాణం చేస్తున్నా.. ప్రామిస్…

 

భరత్ అనే నేను అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ కి సంభందించిన సినిమా. ఈ పొలిటికల్ కదా కథనాన్ని కొరటాల శివ బాగానే నడిపించారని చెప్పొచ్చు. అక్కడక్కడా హీరో ని ఎలివేట్ చేసే సన్నివేశాలు , పొలిటికల్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ వాటిని చూపించిన విధానం కానీ చాలా బాగుంది. పైగా ఈ మూవీ లో మహేష్ బాబు గారి యాక్టింగ్ ని, అయన ఎమోషన్స్ ని, అయన ప్రేఫార్మన్స్ ని మిస్ అయినా ఫాన్స్ అందరు ఈ సినిమాతో సంతృత్తి పరుస్తారనే చెప్పాలి. ఈ మూవీ లో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్ర చెయ్యడానికి అంగీకరించి, అందులో మనకి నచ్చేలా మనం మెచ్చేలా యాక్టింగ్ చేసారని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ కొన్ని కొన్ని సీన్స్ లో అక్కడక్కడ మహేష్ గారి యాక్టింగ్ లో కొంచం ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది. మిగతా సీన్స్ లో మహేష్ బాబు ని కొరటాల శివ ప్రెసెంట్ చేసిన విధానం, సీఎం గా మహేష్ చేసిన చేసిన యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది.

హీరోయిన్ ( కైరా అద్వానీ) ఉండేది లెక్కపెట్టుకునే సీన్స్ మాత్రమే కాకపోతే ఆ అమ్మాయిని చాలా అందంగా చూపించారు. ఆ అమ్మాయికూడా తనకు ఉన్న సీన్స్ ని చాలా జాగ్రత్తగా పద్ధతిగా ఆక్ట్ చేసింది.

మన ప్రకాష్ రాజ్ కానీ రావు రమేష్ కానీ పోసాని గారు కానీ ఇంకా చాలా మంది ఆర్టిస్టులు వారికీ ఇచ్చిన పాత్ర పరిధిలో బాగానే ఆక్ట్ చేసారు. ఇంకో ఇద్దరు ముగ్గురు ఈ రివ్యూ లో చెప్తే బాగుండదు మీరు సినిమా చుస్తే ” ఓ ఈయన కూడా సినిమాలో ఉన్నారా అని అనుకుంటారు.

 

ఈ సినిమా స్టోరీ లైట్ గా లీడర్ మూవీ కి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇది చిన్న క్లూ మాత్రమే… సినిమా లో అసలు స్టోరీ వేరే ఉంటుంది. అది చుస్తే మీకే తెలుస్తుంది.

ఇంకా మూవీ అలా స్లో గా స్టార్ అయ్యి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోకి అలా చేంజ్ అయ్యి ఫస్ట్ హాఫ్ లో కొన్ని కొన్ని మంచి సీన్స్, ఓ రెండు మూడు సీన్స్ ఆర్టిఫీషియల్ గా ఉంటాయి. హీరోయిన్ తో సీన్స్ వచ్చిన దగ్గర అసలు సీఎం కి గర్ల్ ఫ్రెండ్ అవసరమా, లవ్ అంగెల్ కావాలా పాటలు కావాలా అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి రెండు మూడు సీన్స్ చాలా బాగుంటాయి. హీరో ఎలివేషన్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ , మహేష్ బాబు పెర్ఫార్మన్స్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో పీక్స్ లో ఉంటుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమా కొంచం లాగ్ అయ్యిందా అని అనిపిస్తుంది. ఓవరాల్ గా భరత్ అనే నేను మూవీ చూసి బయటికి వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూశామని ఫీలింగ్ తో బయటికి వస్తాం.

 

ఫైనల్ గా గత రెండు సినిమాలతో నిరాశపరిచిన మహేష్ బాబు ” భరత్ అనే నేను” సినిమాతో బ్లాక్బాస్టర్ కొట్టాడని చెపొచ్చు

రొటీన్ రివ్యూ లకి భిన్నంగా సినిమా చూసి నాకు అనిపించినా ఫీలింగ్ ని మీతో పంచుకుంటాను. మరిన్ని కొత్త కొత్త రివ్యూస్ కోసం మా Thopugadu (తోపుగాడు) పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి.

నా రివ్యూ మీకు నచ్చితే షేర్ చెయ్యండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here