అదృష్టవంతుల భార్యలకు మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి

0
107

పురాణాల కాలం నుంచి భార్యను అర్ధాంగి అంటారు. అర్ధాంగి అంటే భర్తలో సగం అని అర్ధం. భార్యలను ఎప్పుడు సుఖంగా, సంతోషంగా చేసుకుంటేనే భర్త యొక్క జీవితం సుఖంగా, సులభంగా ఉంటుంది. భర్త భార్యను ఎంత బాగా చూసుకుంటే భర్త యొక్క అభివృద్ధి కూడా అంత బాగా ఉంటుంది.గరుడ పురాణం ప్రకారం భార్యలో ఈ లక్షణాలు ఉంటే భర్త ప్రపంచంలోనే తనకు తానూ అత్యంత అదృష్టవంతుడిని భావించ వచ్చు. ఆ లక్షణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ లక్షణాలన్నీ కూడా మంత్రాలలో చెప్పబడ్డాయి.

“యా భార్యాయాం గృహే ద్రాక్షాసం భార్యయం ప్రియం వధ. సా భార్యాయాం పతి ప్రాణ , సా భార్యాయాం పతివ్రత” దీనికి అర్ధం ఏ భార్య అయితే ఇంటి పనులన్నీ స్వయానా చాకచక్యంగా చేసుకుంటుందో, పొద్దున లేచిన దగ్గరి నుంచి సాయంత్రం పిల్లలు భర్త తిరిగి వచ్చే దాకా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుందో , ఇల్లును అలంకరించుకొని ఇంటికి వచ్చిన అతిధులను మర్యాదగా ఆప్యాయతతో చూస్తుందో అలాంటి భార్య కలిగిన భర్త అదృష్టవంతుడు.

మధురమైన మాటలు మాట్లాడుతూ , ప్రేమ పంచి భర్త ఒక్కడితో కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులందరితో ప్రేమ పూర్వకంగా ఉంటుందో అలాంటి భార్య ప్రేమించిన ప్రతి మగవాడు అదృష్టవంతుడే. ఏ భార్య అయితే భర్త చెప్పిన అడుగు జాడల్లో నడుస్తుందో , భర్త చెప్పిన ప్రతి పనిని ఆచరిస్తుందో అలాంటి భార్య కలిగిన భర్త ఎంతో అదృష్టవంతుడు అని భావించాలి.

ధర్మాన్ని రక్షించేదిగా , ప్రతి పనిలో ముందు తన కుటుంబాన్ని భర్తను ఉంచేదిగా , భర్త తప్ప మరే ఆలోచన లేని భార్యను పతివ్రత అంటారు. భర్త , పిల్లలు , అత్త మామను తప్ప వేరే ప్రపంచం ఉండదు. ఇలాంటి భార్యను పొందటం ఏ భర్తకు మాత్రం అదృష్టం కాదో . ఈ లక్షణాలు కల భార్యలను కలిగిన భర్తలు ఈ ప్రపంచంలోనే అతి అదృష్టవంతులుగా భావించ వచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here